మాల్దీవుల వివాదంపై స్పందించిన శరద్ పవార్

ఇత‌ర దేశం ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హరిస్తే ఉపేక్షించేది లేదు..

‘Won’t accept anything against PM from outside country’: Sharad Pawar on Maldives row

ముంబయి : మాల్దీవుల వివాదం నేప‌ధ్యంలో ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇత‌ర దేశం ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హరిస్తే ఉపేక్షించేది లేద‌ని స్పష్టం చేశారు. మోడీ దేశ ప్ర‌ధాని అని, ఏ ఇత‌ర దేశం నుంచి ఎలాంటి హోదాలో ఉన్న వ్య‌కైనా మ‌న ప్ర‌ధానిపై అలాంటి వ్యాఖ్య‌లు చేస్తే తాము అంగీక‌రించ‌బోమ‌ని అన్నారు. ప్ర‌ధాని ప‌ద‌విని మ‌నం గౌర‌వించాల‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హం పెల్లుబికింది. మాల్దీవుల ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ముగ్గురు మంత్రులు మల్షా ష‌రీఫ్‌, మ‌రియం షివునా, అబ్ధులా మాజిద్‌ల‌ను స‌స్పెండ్ చేసింది.

ప‌లువురు భార‌తీయులు త‌మ మాల్దీవుల ప‌ర్య‌ట‌న‌ల‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఇక ల‌క్ష‌ద్వీప్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటో షూట్ అనంత‌రం ఆ ప్రాంతానికి ప‌ర్యాట‌కుల తాకిడి పెరిగింది.