మా అమ్మకి కప్ ఇస్తా రా బయ్.. నేను ఫిక్స్- బిగ్ బాస్ హౌస్ లో సన్నీ ధీమా..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ వారానికి వచ్చేసింది. ఈ వారంలో ఎవరు బిగ్ బాస్ 5 విన్నరో తేలిపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ లో సన్నీ , మానస్ , శ్రీరామ చంద్ర , షన్ను , సిరి లు ఉన్నారు. నిన్నటి నుండే ఆడియన్స్ వోటింగ్ మొదలైంది. ఫస్ట్ డే సన్నీ కి గుద్దిపడేసారు. ప్రస్తుతం సన్నీ టాప్ లో ఉన్నాడు. చివర్లో సిరి ఉంది. షన్ను రెండో ప్లేస్ లో , శ్రీరామ చంద్ర మూడో ప్లేస్ లో మానస్ నాల్గో స్థానంలో ఉండగా..సిరి చివరి స్థానంలో ఉంది. ఇక గ్రాండ్ ఫైనల్ కు మిగిలింది ఐదు రోజులే కావడం తో బిగ్ బాస్ ఈ ఐదురోజులు కంటెస్టెంట్స్‌కి హైప్ ఇచ్చే కార్యక్రమాలను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో ఫైనల్‌కి చేరిన ఒక్కో కంటెస్టెంట్ జర్నీని కళ్లకి కడుతూ బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అంతకన్నా ముందు ఎపిసోడ్ సన్నీ , మానస్ లతో స్టార్ట్ చేసారు. మానస్-సన్నీలు టైటిల్ కోసం ముచ్చటించుకున్నారు. ఏమౌతుందో అని టెన్షన్‌గా ఉంది.. టైటిల్ ఎలాగైనా గెలివాలి.. మా అమ్మకి కప్ ఇస్తా రా బయ్.. నేను ఫిక్స్.. ఏదైనా చేయనియ్.. బరాబర్ ఇస్తా’ అని మానస్ ముందు ధీమా వ్యక్తం చేశాడు సన్నీ. టెన్సన్ ఏం పడకురా అని మానస్ సన్నీకి ధైర్యం చెప్పాడు. మరోవైపు బిగ్ బాస్ జంట.. షణ్ముఖ్, సిరిలు పక్క పక్కన కూర్చుని ఎప్పటిలాగే ముచ్చట్లు పెట్టారు. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ నే అని అంత ఫిక్స్ అవుతున్నారు. సన్నీ కూడా ఇదే ధైర్యంతో ఉన్నారు.