హర్మన్‌ప్రీత్‌ సేనకు శుభాకాంక్షలు తెలిపిన గంగూలీ

Sourav ganguly best wishes to Indian women's cricket team
Sourav ganguly best wishes to Indian women’s cricket team

న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భారత క్రికెట్‌ సభ్యులకు శుభాకాంక్షలు. ఎట్టకేలకు ఫైనల్‌ చేరుకోవడం సంతోషంగా ఉంది. భారత మహిళల జట్లు దేశానికి ఎంతో గర్వకారణం అంటూ గంగూలీ ట్వీట్‌ చేశారు. కాగా ఎన్నో ఒడిదుడుకుల మధ్య సెమీ ఫైనల్‌కు చేరిన భారత్‌, సెమీస్‌లో ఇగ్లాండ్‌తో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయింది. దీంతో ఇగ్లాండ్‌ మహిళల జట్టు కంటే ఇండియా అధిక పాయింట్లు కలిగి ఉండడంతో ఆడకుండానే నేరుగా ఫైనల్‌కు చేరుకుంది భారత్‌. కాగా రేపు ఆఖరిపోరు ఆస్ట్రేలియాతో జరగనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/