టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్

టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేశారు. శ‌నివారం బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫికాపై భార‌త్ ఏడు ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. 17 ఏళ్ల త‌రువాత టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది.

ఈ క్ర‌మంలో రోహిత్ సేన‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. రోహిత్ శ‌ర్మ నాయ‌త్వం అద్భుతం అంటూ ప్ర‌శంసించారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా ప్రశంసించారు. చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యను, అద్భుతమైన క్యాచ్ పట్టిన సూర్య కుమార్ను అభినందించారు. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ను మోదీ కొనియాడారు.