ఏపిలో 25 కొత్త జిల్లాల ఏర్పాటు !

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాల సంఖ్య పెంచాం

cm kcr
cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ గవర్నర్‌ ప్రసంగానికి ధర్యవాద తీర్మనంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ..తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో ఉన్న 9 జిల్లాలను 31కు పెంచామని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) మినహా అనేక రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాయని కెసిఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏపి గురించి కెసిఆర్‌ ప్రస్తావిస్తూ..తనకు ఉన్న సమాచారం మేరకు ఆ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని, సిఎం జగన్‌ తనతో మాట్లాడిన దాన్నిబట్టి ఏపీలో జిల్లాల సంఖ్య13 నుంచి 25కు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/