మాజీ మంత్రి కొప్పన మోహనరావు కన్నుమూత

సంతాపం తెలిపిన వైఎస్‌ఆర్‌సిపి నేతలు

మాజీ మంత్రి కొప్పన మోహనరావు కన్నుమూత
koppana-mohan rao

అమరావతి: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సిపి నేత కొప్పన మోహనరావు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తూర్పుగోదావరికి చెందిన ఆయన 1978, 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయంలో అటవీ శాఖ మంత్రిగా పని చేశారు. ఇటీవల వైఎస్‌ఆర్‌సిపి లో చేరి పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈమధ్య ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు వైఎస్‌ఆర్‌సిపి నేతలు సంతాపం తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/