కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం : దుర్గం చెరువులోకి దూకిన యువతి

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద దారుణం చోటుచేసుకుంది. కేబుల్ బ్రిడ్జి నుండి దుర్గం చెరువులోకి ఓ యువతీ దూకింది. స్వప్న అనే 23 ఏళ్ల యువతీ బుధువారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి నుండి ఒక్కసారిగా దుర్గం చెరువులోకి దూకింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా..వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

యువతి బ్రిడ్జిపై చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ వదలిపెట్టింది. దాన్ని పరిశీలించగా అందులో దొరికిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను బట్టి స్వప్న కొంతకాలంగా డిప్రెషన్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యయత్నం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. సమాచారం అందుకున్న స్వప్న అక్క ఘటనా స్థలానికి చేరుకుంది. స్వప్న మానసికంగా బాధపడుతోందని , ఈరోజు ఇంటి నుంచి బయటకు వచ్చిందని తిరిగి ఇంటికి రాలేదని.. పోలీసులు నుంచి ఫోన్ వచ్చాకే తమకు విషయం తెలిసిందని తెలిపింది.