ముషీరాబాద్ లో దారుణం : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని 3 ఏళ్ల బిడ్డను చంపిన తల్లి

తల్లి అనే పేరుకు మచ్చ తెచ్చింది ఓ మహిళ. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన మూడేళ్ల కొడుకుని కడతేర్చింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పార్మిగుట్టలో నివసాముంటున్న ఓ మహిళ.. నెల రోజుల క్రితం కుర్చీమీద నుంచి కిందపడి తన కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులుకేసు నమోదు చేశారు. అయితే తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి తల్లే హత్య చేయించినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.