దేశంలో కొత్తగా 7,591 కరోనా కేసులు

corona virus -india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 9వేలకుపైగా కేసులు రికార్డవగా.. తాజాగా 7వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 27 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 9,206 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు 45 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,44,15,723కు పెరిగింది. ఇందులో 4,38,02,993 మంది కోలుకున్నారు. మొత్తం 5,27,799 మంది కరోనా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 84,931 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.58శాతం ఉందని, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 211.91 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/