మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం

దేశంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన మహిళా ఇంటికి వచ్చేవరకు నమ్మకం లేకుండా పోతుంది. ఎటు నుండి ఏ కామాంధుడు వచ్చి దారుణానికి ఒడిగడతారో తెలియని పరిస్థితి నెలకొనుంది. ప్రభుత్వాలు , కోర్టులు, పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అభం శుభం తెలియని చిన్నారులను సైతం వదిలిపెట్టడం లేదు. సామాన్య మహిళలనే కాదు మహిళలకు రక్షణ గా ఉండే మహిళా కానిస్టేబుల్ ఫై కూడా అత్యాచారం జరుపుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఫై సామూహిక అత్యాచారం జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో ఈ నెల మొదట్లో ముగ్గురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళా కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫేస్బుక్లో ఫ్రెండ్‌గా పరిచయమైన ప్రధాన నిందితుడు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తనతో వాట్సాప్‌లో చాట్ చేస్తున్నట్లు చెప్పింది. సోదరుడి పుట్టిన రోజు పార్టీకి తనని ఆహ్వానించాడని, ప్రధాన నిందితుడితోపాటు అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి సామూహిక అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది. దీనిని వీడియో తీశారని, ప్రధాన నిందితుడి తల్లి, మరో వ్యక్తి తనను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారని, చంపుతామని కూడా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.