కోమటిరెడ్డి కి జగ్గారెడ్డి మద్దతు..

కాంగ్రెస్‌ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. టీపీసీసీ పదవి దక్కనప్పటి నుంచి తీవ్ర అసంతృప్తిలో ఉన్న కోమటిరెడ్డి పార్టీ ఆదేశాలను ధిక్కరించి మరీ వైఎస్ సంస్మరణ సభకు హాజరుకావడం ఇప్పుడు రేవంత్ కు కోపం తెప్పించింది. కోమటిరెడ్డి ఫై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానానికి లేఖ రాసారు. అలాగే ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మధు యాష్కీ సైతం కోమటిరెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బయటికి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చని.. వెన్నుపోటు పొడవొద్దంటూ వ్యాఖ్యలు చేయడం మరింత సంచలంగా మారింది. ఇలా వరుసగా నేతలు కోమటిరెడ్డి ఫై వ్యాఖ్యలు చేస్తుండడం తో నియోజకవర్గ ప్రజలు , అభిమానులు కోమటిరెడ్డిని బయటకు పంపేందుకు ఇలా మాట్లాడుతున్నారని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఈ తరుణంలో సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం కోమటిరెడ్డి కి మద్దతుగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని జగ్గా రెడ్డి ఒప్పేసుకున్నారు. కొత్త పీసీసీకి, కోమటిరెడ్డికి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయని.. అవి త్వరలోనే పోతాయన్నారు. ఆ గ్యాప్ తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ. అటు రేవంత్, ఇటు కోమటిరెడ్డి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వైఎస్ సంస్మరణ సభకు వెళ్లడం తప్పుకాదని సమర్థించారు.