వివేకా హత్యకేసులో కీల‌క సాక్షి గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతి

కడప: ఏపీ అనంతపురం జిల్లా యాడికిలో వివేక హత్యకేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి మృతి చెందారు. వివేకా హత్యకేసులో గంగాధర్‌రెడ్డిని సీబీఐ ఇప్పటికే విచారించింది. మూడుసార్లు కడపకు పిలిపించుకుని సీబీఐ అతన్ని ప్రశ్నించింది. నిందితుడు దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి అనుచరుడు. ప్రేమ వివాహం చేసుకుని యాడికిలో గంగాధర్‌రెడ్డి ఉండేవాడు.

స్వగ్రామం పులివెందుల నుంచి యాడికి వచ్చిన గంగాధర్‌రెడ్డి… ప్రాణముప్పు ఉందని రెండుసార్లు ఎస్పీని కలిశారు. రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని ఇప్పటికే గంగాధర్ రెడ్డి కలిశారు. నిందితుల పేర్లు చెప్పాలని సీబీఐ బెదిరిస్తోందంటూ ఎస్పీకి గతంలో ఫిర్యాదు చేశారు. గంగాధర్‌రెడ్డి రాత్రి నిద్రలోనే మృతిచెందినట్లు బంధువులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అనుమానాస్పద మృతి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గంగాధర్‌రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/