పబ్లిక్ గా పవన్ కు ముగ్గురు భార్యలే..ప్రవైట్ గా ఎంతమంది ఉన్నారో – వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జనసేధినేత పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ నేతల మాటల తూటాలు ఆగడం లేదు. పవన్ పది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల ఫై ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కి ముగ్గురు భార్యలని మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసని, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

ఏలూరులోని వైసీపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంత్రిని సన్నాసి అంటూ పవన్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని, పవన్ ఎంతటి సంస్కారవంతుడే ఆయన మాటలే చెబుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ రెండ్రోజులు రాష్ట్రమంతా పర్యటిస్తే అంతా అల్లకల్లోలమైపోతుందని గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తన అస్థికలు దేశమంతా చిమ్మితే తనలాంటోళ్లు పుడతారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఆయన ఉద్దేశంలో జనసైనికులు, వీరమహిళలు దద్దమ్మలా అంటూ నిలదీశారు. రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకుని పవన్ జన సైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

పవన్ కళ్యాణ్‌కి ముగ్గురు భార్యలని మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసని, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ హీరోయిన్‌ను గర్భవతిని చేసి రూ.5కోట్లిచ్చి అబార్షన్ చేయించాడన్న ప్రచారం కూడా ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఆయన ఒక్క మాటంటే తాము వంద మాటలు అంటామని శ్రీనివాస్ హెచ్చరించారు.