మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూరుకు తరలిస్తున్నాం: బాలకృష్ణ
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్

కుప్పంః యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించారు. తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు అక్కడే ఉన్నారు. మరోవైపు తారకరత్న ప్రస్తుత పరిస్థితి గురించి బాలకృష్ణ మాట్లాడుతూ… తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు. కుప్పంలోని డాక్టర్లు చికిత్స చేశారని… ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తున్నామని తెలిపారు. వైద్యుల సలహా మేరకు బెంగళూరుకు తరలిస్తున్నామని చెప్పారు. రోడ్డు మార్గంలో అంబులెన్సులో తరలించనున్నట్టు తెలిపారు.
మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. తారకరత్నను ఆసుపత్రికి తరలించడం పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు జూనియర్ ఎన్టీఆర్… బాలయ్యతో చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/news/international-news/