ఎస్ఐ, కానిస్టేబుల్ కటాఫ్ మార్కులపై కేసీఆర్ ప్రకటన

ఎస్ఐ, కానిస్టేబుల్ కటాఫ్ మార్కులపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కానిస్టేబుల్‌, ఎస్సై పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు తీపి కబురు ఇచ్చారు. పోలీసు నియామక పరీక్ష కటాఫ్‌ మార్కులను తగ్గిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ మార్కులు తగ్గిస్తామని సీఎం ప్రకటించారు. ఈ విషయమై అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 20 శాతం మార్కులు తగ్గించాలని నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఆగస్టు 28వ తేదీన నిర్వహించారు. అనంతరం ప్రిలిమనరీ కీను కూడా విడుదల చేశారు. అయితే దీనిలో 5 ప్రశ్నలకు సంబంధించి సమాధానలను తప్పులుగా ఉన్నట్లు కీలో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన బోర్డు తుది ఫలితాలను వెల్లడించలేదు. ఈ లోపే తమకు అన్యాయం జరిగిందంటూ ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులు ఆందోళణ చేపట్టారు.

కానిస్టేబుల్ అండ్ ఎస్సై పరీక్షలో అభ్యర్థుల యొక్క అర్హత మార్కులను అందరికీ సమానంగా 30 శాతం రావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే అంతక ముందు నిర్వహించిచ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం అర్హత మార్కులు వస్తే.. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వారు. కానీ ఇటీవల వల విడుదల చేసి నోటిఫికేషన్లో అన్ని క్యాటగిరీల అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలని పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఈ సారి నెగెటివ్ విధానం కూడా తీసుకొచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. 40 శాతంగా ఉన్న ఓసీ అభ్యర్థులకు 10 శాతం సడలింపు ఇచ్చి, బీసీ అభ్యర్థులకు కూడా 5 శాతం రిజర్వేషన్ సడలింపు ఇచ్చి.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి సడలింపు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ కటాఫ్‌ మార్కులు తగ్గించనున్నట్లు తెలిపి వారిలో ఆనందం నింపారు.