దేశాన్ని కాపాడాలనుకునే ఎవరికైనా ఆయుధాలిస్తాం : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

ఉక్రెయిన్ పై తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్న రష్యా

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై దాడులకు పాల్పడుతున్నాయి. యుద్ధం ప్రారంభమై చాలా గంటలు గడుస్తున్నా ఉక్రెయిన్ రష్యా బలగాలను ప్రతిఘటించలేకపోయింది. ఇంతలోనే ఉక్రెయిన్ సంచలన ప్రకటన చేసింది. రష్యాకు చెందిన ఐదు ఫైటర్ జెట్లను, ఒక హెలికాప్టర్ ను కూల్చివేశామని ప్రకటించింది.

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. దేశాన్ని కాపాడాలనుకునే ఎవరికైనా ఆయుధాలను ఇస్తామని చెప్పారు. దేశంలోని నగరాలతో పాటు దేశం నలుమూలలను కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/