కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారా?: బండి సంజయ్

Will Congress and BRS parties make a BC person the Chief Minister?: Bandi Sanjay

కరీంనగర్‌ః తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగుల కోసం బిజెపి నేతలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. ఈ నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం తెలంగాణ గద్దె ఎక్కగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటిచ్చారు. కరీంనగర్​లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

“రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు నిరుద్యోగులు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారా? బంగారు తెలంగాణ అని.. అప్పుల రాష్ట్రంగా మార్చారు. రాబోయే ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినవి. రామరాజ్యం కావాలా? రజాకార్ల రాజ్యం కావాలా? రామరాజ్యం కావాలంటే బిజెపికి ఓటు వేయండి.” అని బండి సంజయ్ ప్రజలను కోరారు.