‘వీధుల్లో స్ప్రే చేసే డిస్‌ ఇన్‌ఫెక్టంట్‌ వల్ల కరోనా చావదు’

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

coronavirus cases updates
‘Corona does not die due to disinfectant spraying: W.H.O

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా వీధుల్లో స్ప్రే చేసే డిస్‌ ఇన్‌ఫెక్టంట్‌ (క్రిమి సంహారక)ల వల్ల కరోనా చావదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఇది అధికమైతే ప్రమాదమే అని హెచ్చరించింది. ఇది కాలుష్యంపై ఎలాంటి ప్రభావం చూపక పోగా.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది.

వీధులు, మార్కెట్‌ స్థలాలు, ఇతర బహిరంగ ప్రదేశా ల్లో క్రిమి సంహారక మందులు చల్లడం వల్ల అది ధూళి కణాల్లోకి వెళ్తోందని, దాంతో అది కరోనానే కాదు.. ఇతర క్రిములపై కూడా ప్రభావం చూపదని చెప్పింది.

క్రిమి సంహారక మందులు చల్లడం ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫారసు చేయబడదు అని పేర్కొంది.

మనుషుల పై క్లోరిన్‌ వంటి రసాయనాలను నేరుగా ప్రయోగిస్తున్నారని, దీనివల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని అనుకోవడం భ్రమే అని అభిప్రాయపడింది.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/