నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం – మంత్రి అనిల్

Anil-kumar
Anil-kumar

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల హడావిడి మొదలైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న వైసీపీ ..ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా విజయ డంఖా మోగించాలని చూస్తుంది. మరోపక్క వరుస పరాజయాలతో ముఖం కూడా చూపించలేకపోతున్న టీడీపీ..ఈ ఎన్నికల్లో గెలిచి కార్య కర్తల్లో కొత్త ఉత్సహం నింపాలని చూస్తుంది. ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇదిలా ఉంటె నెల్లూరు కార్పొరేషన్ లోని 54వ డివిజన్ అభ్యర్థి షఫియా బేగంతో కలిసి అనిల్ యాదవ్ శుక్రవారం ప్రచారం చేసారు.

ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అన్నారు. నెల్లూరులోని ఇస్లాంపేట, భగత్ సింగ్ కాలనీల్లో ఒక్క ఇంటిని కూడా తొలగించబోమని తెలిపారు. తెలుగుదేశం, సీపీఎం పార్టీల నేతలు చేస్తున్న దుష్ప్రచాన్ని నమ్మొద్దని అన్నారు. ఈ రెండు పార్టీలకు ఓట్లు వేసినా వేస్టేనని చెప్పారు. ప్రతి ఇంటికి పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని అన్నారు. జగన్ పాలనకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఓటు చాలా విలువైనదని… ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న వైసీపీకి ఓటు వేయాలని కోరారు.