అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్‌కు ఆమోదం: బహ్రెయిన్‌

మేనామ : భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి బహ్రెయిన్‌ నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేటరి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు టీకా అందుబాటులో ఉండనున్నది. కొవాగ్జిన్‌ టీకాను ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే.

కాగా, కొవాగ్జిన్‌ టీకా 77.8శాతం ప్రభావంతంగా పని చేస్తున్నట్లు ద లాన్సెట్‌ అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌ నుంచి 2021, మే వరకు 18 ఏళ్ల నుంచి 97 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న 24,419 మందిపై కొవాగ్జిన్‌ సమర్థతపై అధ్యయనం నిర్వహించినట్లు ది లాన్సెట్‌ పేర్కొన్నది. డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/