కలుషిత మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలిః డబ్ల్యూహెచ్‌

ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌ విజ్ఞప్తి

WHO urges ‘immediate action’ after cough syrup deaths

న్యూయార్క్‌: కలుషిత మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ ప్రపంచ దేశాలను విజ్ఞప్తి చేసింది. ఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. జాంబియా, ఇండోనేషియా, ఉబ్జెకిస్తాన్‌లో ఐదేళ్లపు చిన్నారులు దాదాపు 300 మందికిపైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటనలో పేర్కొంది. కొన్ని దగ్గు సిరప్‌లలో డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించామని, వాటి కారణంగా పిల్లల్లో కిడ్నీలు దెబ్బతింటాయని తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. డైథైలీన్ గ్లైకాల్‌, ఇథిలీన్ గ్లైకాల్ విషపూరిత రసాయాలు.. ప్రాణాంతకమని, వాటిని ఔషధాల్లో ఉండకూడదని చెబుతున్నది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ 194 సభ్య దేశాలకు.. కలుషితమైన మందులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

తద్వారా మరణాలను నివారించవచ్చని పేర్కొంది. మార్కెట్‌లో లభ్యమయ్యే అన్ని వైద్య ఉత్పత్తులు తప్పనిసరిగా సమర్థ అధికారం ద్వారా ఆమోదించాలని, అధీకృత లైసెన్స్‌ కూడా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. సభ్యదేశాలన్నీ తమ తమ దేశాల్లోని ఔషధాల తయారీ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పరీక్షలు జరిపేందుకు నిబంధనలను రూపొందించాలని చెప్పింది. ఇదిలా ఉండగా.. దగ్గు సిరప్‌ కారణంగా సమర్‌కండ్‌లో కనీసం 18 మంది పిల్లలు మృతి చెందారని ఉబ్జెకిస్తాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ డిసెంబర్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో తయారైన దగ్గు సిరప్ తాగి చిన్నారులు చనిపోయారని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపించింది. ఆయా సిరప్‌లు భారత్‌కు చెందిన కంపెనీవని ఆరోపిస్తూ.. వాటిని బ్యాన్‌ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/