కబడ్డీ ఆడుతూ కిందపడిన మంత్రి రోజా

ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా కబడ్డీ ఆడుతూ కింద పడ్డారు. మంత్రి అయ్యాక రోజా దూకుడు పెంచింది. అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ వస్తున్నారు, గుడిలు , బడులు ఇలా ఏది వదిలిపెట్టడం లేదు. అన్ని ప్రారంబోత్సవాలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో కబడ్డీ ఆడుతూ కింద పడిన ఘటన చిత్తూరు లో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో జగనన్న క్రీడా సంబరాలను మంత్రి ఆర్కే రోజా సోమవారం ప్రారంభించారు. ఈ పోటీలలో పలమనేరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, నెల్లూరు, ‌నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా విద్యార్థులతో కలిసి పలు క్రీడలను ఆడి అలరించారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఆడి.. మహిళా విద్యార్థులను ఆమె ప్రోత్సహించారు. మంత్రితో కలిసి విద్యార్థులు తెగ ఎంజాయ్ చేశారు.

జగనన్న క్రీడా సంబరాల సందర్భంగా మంత్రి రోజా కబడ్డీ ఆడారు. రైడ్‌కు వెళ్లిన రోజాను అమ్మాయిలు టాకిల్ చేశారు. లైన్ వద్ద మంత్రిని పట్టునుకి బయటకు తోశారు. దాంతో ఆమె కిందపడిపోయారు. మంత్రిపై ఇద్దరు , ముగ్గురు విద్యార్థులు పడిపోయారు. తనకు ఏమీ కాలేదని చెప్పిన మంత్రి మళ్లీ కబడ్డీ ఆడారు. మరోసారి రైడ్‌కు వెళ్లిన రోజా.. సక్సెస్ కాలేకపోయారు. అయితే మంత్రి రోజా కిందపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన వారు రోజాను మెచ్చుకుంటున్నారు. అమ్మాయిలను ప్రోత్సహించిన తీరు బాగుందని కామెంట్స్ వేస్తున్నారు.