చైనాలో కోవిడ్ ప‌రిస్థితిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న‌

WHO chief expresses concern over evolving Covid situation in China, urges Beijing to accelerate vaccination

జెనీవాః చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న క‌రోనా కేసుల ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అవ‌స‌ర‌మైన వారికి త్వ‌ర‌గా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో కోరింది. చైనాలో తీవ్ర‌మైన క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న‌క‌ర‌మే అని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్ర‌త ఉన్న‌దో ఆ దేశం వెల్ల‌డించాల‌ని టెడ్రోస్ కోరారు. హాస్పిట‌ళ్ల‌లో జ‌రుగుతున్న అడ్మిష‌న్లు, ఇంటెన్సివ్ కేర్ అవ‌స‌రాల గురించి డ్రాగన్ దేశం వెల్ల‌డించాల‌ని ఆయ‌న తెలిపారు.

వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌పై ఫోక‌స్ చేసే రీతిలో చైనాకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు టెడ్రోస్ చెప్పారు. ఆ దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. దాదాపు 2020 నుంచి జీరో కోవిడ్ పాల‌సీలో భాగంగా క‌ఠిన ఆరోగ్య ఆంక్ష‌ల‌ను చైనా అమ‌లు చేస్తోంది. కానీ ఇటీవ‌ల నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో ఆ ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/