తెలుసుకో: సముద్ర పక్షి వైట్‌టెర్న్
వైట్‌టెర్న్ ప్రత్యేకత

తెల్లగా, చూసేందుకు కోకిలలా ఉండే సముద్ర పక్షి వైట్‌టెర్న్‌కు కొన్ని ప్రత్యేకతలున్నవి. ఈ పక్షి ఎక్కువగా పసిఫిక్ సముద్రతీరంలో ఉంటుంది.
చిన్న చిన్న ద్వీపాల్లో గుడ్లు పెడుతుంది. చిలీ, కొలంబియా నుంచి న్యూజిలాండ్ వరకు మేం ఎక్కువగా కనిపిస్తుంది.
చైనా నుండి ఇండియా, దక్షిణ మాల్దీవులు, హిందూ మహా సముద్రంలోని దీవులు, సౌతాఫ్రికా తీరాల్లో విహరిస్తుంది.
జపాన్, మడగాస్కర్, మెక్సికో, అట్లాంటిక్ మహాసముద్రతీరంలోని కొన్ని ద్వీపాల్లో కూడా కనిపిస్తుంది. కొందరు వీటిని పెంపుడు పక్షుల్లా పెంచుకుంటారు.
ఈ పక్షులు 45 కిలోమీటర్ల పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి. ఇవి సముద్రంలో కనిపిస్తే అక్కడికి దగ్గర్లోనే భూభాగం ఉందన్న మాట. అందుకే సముద్రంలో ప్రయాణంలో చేసే వారికి ఇది దిక్సూచిలా ఉపయోగపడుతుంది. ఇవి నీళ్లలో చిన్న చిన్న చేపలను వేటాడి తింటాయి.
కింగ్‌ఫిషర్ పక్షిలాగే నీళ్లలో నిట్టనిలువుగా దూకి చేపలను పట్టుకుంటుంది. ఇవి చెట్ల కొమ్మల మీద గూళ్లు లేకుండానే గుడ్లు పెడతాయి. గుడ్డును 30 నుండి 40 రోజుల పాటు పొదుగుతుంది.
తాజా సినిమా వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/