రేవంత్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

పిటీషన్ల విచారణ పూర్తి

revanth reddy
revanth reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన కేసులో బెయిల్‌ మంజూరు చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారి చేసింది. డ్రోన్‌ కెమెరాతో అనుమతి లేకుండా చిత్రీకరించారని నార్సింగి పోలీసులు రేవంత్‌డ్డిని అరెస్ట్‌ చేసి మియాపూర్‌ కోర్టులో హజరు పరచగా.. కోర్టు రేవంత్‌రెడ్డికి రిమాండ్‌ విధించింది. అయితే పార్లమెంట్‌ సమావేశాలకు హజరు కావాల్సి ఉండడతో ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని రేవంత్‌రెడ్డి హైకోర్టులో వేరువేరు పిటీషన్లు దాఖలు చేయడం జరిగింది. వీటిని ఇవాళ విచారించిన హైకోర్టు బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/