వైట్‌హౌస్ ఫొటోగ్రాఫర్: షీలా క్రెయిగ్హెడ్
మహిళలు ఫొటోగ్రఫీతో ప్రతిభను చాటుకుంటున్నారు.

మహిళలు రాజకీయాల్లో సైతం ఫొటోగ్రఫీలతో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. వేడుక ఏదైనా వారూ ఉండితీరాల్సిందే అనే స్థాయికి ఎదగడం శుభపరిణామం. అమెరికాలోని వైట్‌హౌస్‌లో షెలా క్రైగెడ్ అనే వనిత తన ఫొటోగ్రఫీతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. వైట్‌హౌస్‌లో ఏ వేడుక జరిగినా ఆమె ఉండి తీరాల్సిందే.
ఆమె ఏప్రభుత్వ అధికారో కాదు. షెలా క్రైగెడ్ వైట్‌హౌస్ అధికారిక ఫొటోగ్రాఫర్. శ్వేతసౌధం వేడుకలని అందంగా చిత్రీకరించే ఆమె కెమెరాకన్ను ప్రపంచానికి ఎన్నో అందమైన జ్ఞాపకాలని అందించింది. షెలా క్రైగెడ్ అమెరికాలోని కనెక్టికట్‌లో పుట్టి, పెరిగారు. తల్లిదండ్రులకు ఫొటో ల్యాబ్ ఉండేది. దీంతో చిన్నవయసులోనే ఈ రంగంపై ఆసక్తి పెంచుకుంది.

కెరీర్ ఆరంభంలో బోస్టన్ గ్లోబ్, అసోసియేటెడ్ ప్రెస్, గెట్టి ఇమేజెస్ సంస్థల్లో ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసారు. ఆ అనుభవంతోనే జార్జ్‌బుష్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో లారాబుష్‌కు ప్రత్యేక ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే అవకాశం దక్కించుకుంది.
అలా వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన షెలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2008లో బుష్ కూతురు జెన్నా బుష్ పెళ్లి వేడుకలు ఈమె ఆధ్వర్యంలోనే జరిగాయి.
దీంతోపాటు అమెరికాలోని రాష్ట్రాల గవర్నర్లకు అధికారిక ప్రచార ఫొటోగ్రాఫర్‌గా పనిచేసింది. ఆ అనుభవంతో 2017లో వైట్‌హౌస్ అధికారిక ఫొటోగ్రాఫర్‌గా నియమితురాలైంది.
ట్రంప్ పాలనలో ఫ్యాషన్, మిలటరీ, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో మొత్తం నలుగురు అధికారిక ఫొటోగ్రాఫర్లు ఉంటే వారిలో షెలా ఒకరు.
అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా, వెంట ఈమె ఉండాల్సిందే. ఫొటోలు తీయాల్సిందే. ప్రెస్‌మీట్‌లు, సమావేశాలు, సదస్సులు జరిగే ప్రదేశాలకు ముందుగానే వెళ్లి అధ్యక్షుడిని ఎలా చిత్రీకరించాలో ప్రణాళిక వేసుకుంటుంది. ప్రెసిడెంట్ ఫొటోల్లో బాగా కనిపించాలనుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
అందుకే ఆయనకు ఏది నచ్చుతుందో లేదో తెలుసుకుంటూ నన్ను నేను మెరుగుపరచుకుంటా అంటారు షెలా. ఆయన మెప్పు పొందడానికి వందశాతం కచ్చితత్వంతో పనిచేస్తాను.
వివిధ కోణాల్లో కొత్తగా అధ్యక్షుడిని చూపించడానికి వినూత్నంగా ఆలోచిస్తా.
డాక్యుమెంటరీలు, కుటుంబ వేడుకలకు పొట్రేట్ యాంగిల్‌లో ఫొటోలు తీస్తారు. ఆయన అథ్లెటిక్స్, ఇతర ఆటలు ఆడుతుంటే స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా మారాల్సిందే.
ఇందుకు గతంలో స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా నాకున్న అనుభవం ఉపయోగపడుతుంది అని చెబుతోందామె.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/