సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్న పేదల పరిస్థితేమిటి?
ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నారాలోకేష్

అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు. రాష్ట్రంలో నాలుగు రోజులు క్వారంటైన్లో ఉన్నవారికి ప్రభుత్వం రూ. 2వేలు ఆర్దిక సాయం ప్రకటించింది. మరి లాక్డౌన్ కారణంగా 40 రోజుల నుంచి సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్న పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. పేదలకు తక్షణమే 5వేల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించి వారిని ఆదుకోవాలని సూచించాడు. అకాల వర్షాల కారణంగా పంట నష్టం అంచనా వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని అన్నారు. వెంటనే వారకి పంటనష్టం అంచనా పుర్తి చేసి రైతులకు పరిహారం అందిచాలని కోరాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/