జేఎన్‌యూ ఘటనపై గుత్తాజ్వాల ఫైర్‌

ఇంత జరుతున్నా ఊరికే ఉందామా అంటూ ట్వీట్‌

Jwala Gutta
Jwala Gutta

న్యూఢిల్లీ: ప్రముఖ భారత మాజీ స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల ట్విట్టర్‌ వేదికగా జేఎన్‌యూలో జరిగిన హింసపై మండిపడ్డారు. ఏంటి ఈ హింస? అసలు జేఎన్‌యూలో ఏం జరుగుతోంది అని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో విద్యార్థులకు ఏం జరిగిందో చూడండి. ఇంత జరుగుతున్నా ఊరికే ఉందామా? అని ట్వీట్‌ చేసింది. కాగా దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. కొందరు దుండగులు ముసుగులు ధరించి కర్రలు, రాడ్లు, రాళ్లతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వర్సిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసితి గృహాల్లోకి ప్రవేశించి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఘోష్‌ తల పగలింది. వెంటనె ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. అయితే జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనపై పలువురు ప్రముఖులు, బాలీవుడ్‌ తారలు సైతం స్పందిచారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/