సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన సీఎం మమతా బెనర్జీ

హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఫోన్ కాల్ చేశారు. ఆయన పలు రాజకీయ అంశాలపై చర్చించారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. సమాఖ్య వ్యవస్థను కాపాడుకోవాలని, సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు దీదీ.

విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని మమత చెప్పారు. కాగా, మార్చి 3వ తేదీన వారణాసిలో టీఎంసీ భారీ ర్యాలీ చేపట్టనుందని మమత అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రాంతీయ పార్టీలతోనూ సత్సంబధాలు లేవన్నారు. దాని దారిదే.. తమ దారి తమదే అని పేర్కొన్నారు. ఫైడరల్ ఫ్రంట్‌కు సహకారం అవసరం అని దీదీ కోరారు. ఇదే విషయమై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తోనూ మాట్లాడినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/