బెంగాల్​లో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Road Accident
Road accident

ఖరగ్​పుర్ః పశ్చిమ మేదినీపుర్​ జిల్లా.. ఖరగ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బురమలా వద్ద ఈరోజు తెల్లవారుజామున 10 నుంచి 12 మంది కార్మికులు కలిసి పికప్​ వ్యాన్​లో పూలు లోడింగ్​ చేస్తున్నారు. అకస్మాత్తుగా సిమెంట్​ లారీ వెనుక నుంచి వచ్చి వరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. మాకు సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకున్నాం. అప్పటికే మృతి చెందిన ఐదుగురిని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అని పోలీసులు తెలిపారు.