దాదాని ట్రోల్ చేసిన సచిన్ టెండూల్కర్

ముంబయి: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ట్రోల్ చేశారు. దాదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఈ ట్రోలింగ్‌కు కారణం అయింది. వివరాల్లోకి వెళితే..ఉదయం చల్లని వాతావరణంలో మంచి ఫిట్నెస్ సెషన్‌ను చేస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు దాదా తను ఫిట్నెస్ సెషన్ చేస్తున్న ఫోటోను జత చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సచిన్ టెండూల్కర్ ..వెల్డన్ దాది! ఏం చెప్పావ్ అని సరదాగా కామెంట్ చేశారు. సచిన్ కామెంట్‌కు దాదా రి ట్వీట్ చేశాడు. థాంక్యూ ఛాంపియన్ ఎప్పూడు ఫిట్‌నెస్‌పైనే దృష్టి. మన అద్భుతమైన శిక్షణ రోజులు నీకు గుర్తున్నాయా అని రాసుకొచ్చాడు. అవును దాది శిక్షణలో నువ్వు ఎంత ఎంజా§్ు చేశావో అందరికీ గుర్తుంది. ప్రత్యేకంగా స్కిప్పింగ్‌లో అని సచిన్ రిప్లై ఇచ్చాడు. దీంతో సచిన్ టెండూల్కర్-గంగూలీ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ మారింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/