ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌.. అతనిలా మారాలి

ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ క్యారీ

MS Dhoni & Alex Carey
MS Dhoni & Alex Carey

ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ తరహాలోనే మంచి మ్యాచ్‌ ఫినిషర్‌గా ఎదగాలనుకుంటున్నా అని ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ క్యారీ తెలిపాడు. ఆస్ట్రేలియాకు ఒక ఫినిషర్‌గా మారడం కోసం యత్నిస్తున్నాఅని పేర్కొన్నాడు. తాజాగా శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను విజయవంతంగా ముగించిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల పోరుకు సిద్ధమవుతోంది. మంగళవారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా క్యారీ మీడియాతో మాట్లాడాడు. ‘మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్‌ చేసే సత్తా నాలో ఉంది. కానీ.. బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ‘ప్రపంచ క్రికెట్‌లో ధోనీ ఎంత అత్యుత్తమ ఫినిషర్‌ అనే విషయం మన అందరికి తెలుసు. ప్రతీ ఒక్కరూ అతన్ని ఆదర్శంగా తీసుకుంటారనేది కాదనలేని వాస్తవం. ఇందులో నేను కూడా ఉన్నా. నాకు ధోనీలా కావాలని ఉంది. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తా. గతేడాది ధోనీతో కలిసి చాలా ఎక్కువ క్రికెట్‌ను ఆస్వాదించడం నా అదృష్టం. అతడి నుంచి వీలైనంత నేర్చుకోవాలి’ అని క్యారీ అన్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/