మున్సిపాలిటీలకు సీఎం కెసిఆర్‌ చేసిందేమీ లేదు

నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన టిఆర్‌ఎస్‌..ఏ ఒక్కరికైనా ఇచ్చిందా?

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరేళ్ల కాలంలో మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌లు చేసిందేమీ లేదని టిపిసిసి ఛీఫ్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్‌ఎస్‌ డబ్బులు ప్రవాహంతో గెలిచే ప్రయత్నం చేస్తుందని ఉత్తమ్‌ ఆరోపించారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్‌లకు ఏం చేశారని టిఆర్‌ఎస్‌ నాయకులు ఓట్లు అడుగబోతున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన టిఆర్‌ఎస్‌.. ఏ ఒక్కరికైనా ఇచ్చిందా అని నిలదీశారు. ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదని..రెండో పంటకు రైతుబంధు ఇవ్వలేదని ఉత్తమ్‌ విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కెసిఆర్‌కు ఈ ఎన్నికల్లో ఝలక్‌ ఇవ్వాలని ప్రజలను ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కోరారు. కాగా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొని కాంగ్రెస్‌ కార్యకర్తలు మున్సిపల్‌ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/