క్రిస్మస్ కానుకగా ‘పుష్ప’

డిసెంబర్ లో మొదటి పార్ట్ రిలీజ్

Allu Arjun's 'Pushpa' release for Christmas
Allu Arjun’s ‘Pushpa’ release for Christmas

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొల్పుకుంది. బన్నీ మరియు సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం నిన్ననే ఫస్ట్ సింగిల్ పై కూడా సాలిడ్ అప్డేట్ ఇవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత స్థాయికి వెళ్తూ వస్తున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మరో భారీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రంపై ముందు నుంచి వినిపిస్తున్న రిలీజ్ సమయమే ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ నెలలో మొదటి పార్ట్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/