భారత వెయిట్‌లిఫ్టర్‌పై నాలుగేళ్ల నిషేధం

డోపింగ్‌ నిబంధన ఉల్లంఘన కారణంగా సర్బ్‌జీత్‌ కౌర్‌పై వేటు

weightlifter sarbjeet kaur
weightlifter sarbjeet kaur

న్యూఢిల్లీ: భారత వెయిట్‌లిఫ్టర్ సర్బ్‌జీత్ కౌర్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. డోపింగ్ నిబంధన ఉల్లంఘించినందుకు గాను సర్బ్‌జీత్ కౌర్‌‌పై నాలుగేళ్ల నిషేధం విధించడంతో పాటు జరిమానా విధించామని నాడా ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో విశాఖపట్నం వేదికగా జరిగిన 34వ మహిళా సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 71 కిలోల విభాగంలో సర్బ్‌జీత్ కౌర్‌ పతకాన్ని గెలుచుకుంది. ఈ ఈవెంట్ ముగిసిన అనంతరం నాడా డోప్ కంట్రోల్ ఆఫీసర్ ఆమె డోప్ టెస్ట్ శాంపిల్‌ను సేకరించారు. వెయిట్‌లిఫ్టర్ సర్బ్‌జీత్ కౌర్‌ డోప్ శాంపిల్ విశ్లేషణలో నిషేధిత పదార్థాలైన డి-హైడ్రాక్సీఎల్‌జిడి- 4033 (ఎల్‌జిడి 4033 మెటాబోలైట్), సెలెక్టివ్ ఆండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేషన్స్, ఆస్టారిన్ (ఎనోబోసార్మ్)లు ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె నాలుగేళ్ల పాటు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. గతంలో వెయిట్‌లిఫ్టర్ సీమా కూడా డోపింగ్‌కు పాల్పడినందుకు గాను ఆమెను నాడా నాలుగేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/