విజయసాయిరెడ్డి గారు కొన్ని ప్రశ్నలకు సమధానం చెప్పండి

buddha venkanna
buddha venkanna

అమరావతి: టిడిపి నేత బుద్దా వెంకన్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్‌ ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగారు. ముఖ్యమంత్రి జగన్‌ గారు రాజధాని విషయంలో ఆడుతున్న మూడు ముక్కలాట గురించి గొప్పగా చెబుతున్న విజయసాయిరెడ్డి ఎంపీ గారు కొన్ని ప్రశ్నలకు సమధానం చెప్పండి అని అడిగారు. టిడిపి హయంలో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తూ శాసనసభలో చేసిన తీర్మానానికి సీఎం జగన్‌గారు జైకొట్టింది వాస్తవంకాదా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. రాజధాని కోసం 30వేల ఎకరాలు ఉండాలి అన్ని ప్రాంతాలకు సమ దూరంలో ఉండాలి అని ముఖ్యమంత్రి జగన్‌గారు అనలేదా? అని విజయసాయిరెడ్డిని సూటిగా ట్విట్టర్‌ ద్వారా బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/