కరోనాపై పోరులో విజయం సాధించి తీరుతాం..మోదీ

బిజెపి 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ప్రసంగించిన ప్రధాని

naredra modi.
naredra modi.

దిల్లీ: దేశంలో కరోనా తీవ్రతను ప్రజలంతా అర్ధం చేసుకున్నారని, అందుకే దేశ ప్రజలందరూ లైట్లు ఆర్పివేసి ఐక్యతను చాటారన్నారు ప్రధాని మోదీ . మహామ్మారిపై పోరులో ప్రపంచదేశాలకు భారత్‌ ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు తమ భాధ్యత నిర్వర్తించాలని అన్నారు. నేడు బిజెపి 40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. దేశం నుంచి కరోనా మహామ్మారిని తరిమికొట్టేందుకు అందరం ఒక్కటవుదాం అని పిలుపు నిచ్చారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దేశంలో పలు కఠిన నిర్ణయాలు తీసుకన్నట్లు వెల్లడించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాయని ఈ సందర్బంగా మోదీ తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/