మా కుటుంబంలో అంతర్గతంగా ఎలాంటి సమస్యలు లేవుః శరద్ పవార్

తిరుగుబాటు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వ్యాఖ్య

we-dont-have-any-problems-in-family-says-sharad-pawar

ముంబయిః మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసవత్తంగా మారాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. పార్టీని నిట్టనిలునా చీల్చేశారు. మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ మాట్లాడుతూ… తమ కుటుంబంలో అంతర్గతంగా ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. కుటుంబంలో తాము రాజకీయాలు మాట్లాడుకోమని అన్నారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమ కుటుంబంలో అందరికీ ఉంటుందని చెప్పారు. నిన్నటి నుంచి తాను ఎవరితో మాట్లాడలేదని తెలిపారు. తిరుగుబాటు చేసిన నేతలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.