ఏపీ సచివాలయంలో మన్మధ రాజా… మన్మధ రాజా అంటూ వాలంటీర్లు అదిరిపోయే స్టెప్స్

ఏపీ సచివాలయంలో మన్మధ రాజా… మన్మధ రాజా అంటూ వాలంటీర్లు అదిరిపోయే స్టెప్స్

ప్రభుత్వ ఆఫీస్ లలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బయట ఎన్ని వేషాలు వేసిన ఆఫీస్ లలో మాత్రం బాధ్యతగా ఉండాలి. ఆలా బాధ్యత ను మరచి ప్రవర్తిస్తే తమ ఉద్యోగాలే పోగొట్టుకోవాల్సి వస్తుంది. పలు సంఘటనలు జరిగాయి కూడా. తాజాగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి వార్డు సచివాలయంలో సిబ్బంది వేడుకలు జరుపుకున్నారు.

సిబ్బంది, వాలంటీర్లు డాన్స్ లు వేస్తే నానా రచ్చ చేసారు. మన్మధ రాజా… మన్మధ రాజా అంటూ వాలంటీర్లు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గతంలో బర్త్ డే వేడుకలు, ఇతర సంబరాలంటూ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు డాన్సులు వేస్తూ చిందులు వేయడం చేసారు. ఇక ఇప్పుడు మరోసారి అదే తరహాలో డాన్సులు వేయడం ఫై అంత విమర్శిస్తున్నారు. మరి దీనిపై ఫై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.