ముగిసిన కార్పోరేషన్‌ మేయర్ల ఎన్నిక

కొనసాగుతున్న చైర్మన్ల ఎంపిక

Greater Hyderabad Municipal Corporation
Greater Hyderabad Municipal Corporation

హైదరాబాద్‌: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో మేయర్ల ఎన్నిక తంతు ముగిసింది. మొత్తం 9 కార్పోరేషనల్లకు ఎన్నికలు జరుగగా.. ఇప్పటి వరకు 8 మున్సిపల్‌ కార్పోరేషన్లకు ఎన్నికైన మేయర్ల వివరాలు వెల్లడయ్యాయి. నిజాంపేట మేయర్‌గా కొలన్ నీలారెడ్డి, డిప్యూటీ మేయర్‌గా ధనరాజ్‌ యాదవ్‌, బోడుప్పల్ మేయర్‌గా సామల బుచ్చిరెడ్డి, జవహార్‌నగర్ మేయర్‌గా మేకల కావ్య, బడంగ్‌పేట్‌ మేయర్‌గా చిగురింత పారిజాత, బండ్లగూడ జాగీర్‌ మేయర్‌గా మహేందర్ గౌడ్, పీర్జాదీగూడ మేయర్‌గా జక్కా వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌ మేయర్‌గా దండు నీతూకిరణ్, రామగుండం మేయర్‌గా బంగి అనిల్ కుమార్, మీర్‌పేట్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ముడావత్ దుర్గ, డిప్యూటీ మేయర్‌గా తీగల విక్రమ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 120 మున్సిపాలిటీల పరిధిలో విజయం సాధించిన కౌన్సిలర్లు.. 9 కార్పొరేషన్ల పరిధిలోని కార్పొరేటర్లతో జిల్లా అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఇక ప్రమాణస్వీకారం అనంతరం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. కాగా ఇక మీదట చైర్మన్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/