హిజాబ్ వివాదం పై స్పందించిన కమల్ హాసన్
కర్నాటక పరిస్థితులు పొరుగు రాష్ట్రాలకు రాకూడదు.. కమల్ హాసన్

న్యూఢిల్లీ: హిజాబ్ ఇష్యూ కర్ణాటకను కుదిపేస్తోంది. ఈ రగడపై నటుడు కమల్ హాసన్ స్పందించారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయని అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కమల్ కామెంట్ చేశారు. కర్ణాటక ఇష్యూ పొరుగు రాష్ట్రాల వరకూ రాకూడదు. తమిళనాడు సహా అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిదంటూ ట్విట్టర్‌లో వెల్లడించారు.
కాగా, హిజాబ్ వివాదం కర్నాటకలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మూడురోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరి నమ్మకాలు వారివని , రాజ్యాంగమే తమకు దైవమని ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టులో కీలక విచారణ జరిగింది. అన్నివర్గాల ఆచారసాంప్రదాయాలను తాము గౌరవిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్ధులు రోడ్డెక్కకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. హిజాబ్ వివాదంపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది కోర్ట్. హిజాబ్ వివాదం కారణంగా విద్యాసంస్థల్లో హింస చెలరేగడంతో కర్నాటక ప్రభుత్వం స్కూళ్లు , కాలేజ్‌లకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. జనవరి 1న ఉడుపి PU కాలేజీలో హిజాబ్ ధరించిన యువతులను కాలేజీలోకి అనుమతించలేదు యాజమాన్యం. వారు హిజాబ్ ధరిస్తే మేం కాషాయ కండువాలను వేసుకుంటాం..అంటూ పోటాపోటీ నెలకొంది. కొందరు హిజాబ్‌లు..మరికొందరు కాషాయ కండువాలతో హాజరవడం చినికి చినికి గాలివానలా మారింది. లేటెస్ట్‌గా హింసకు దారితీసింది. లాఠీచార్జ్‌లు, టియర్ గ్యాస్ ప్రయోగించడం వరకు వెళ్లింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/