తెనాలిలో వాలంటీర్ హత్య

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు దాడి

Volunteer killed in Tenali
Volunteer killed in Tenali

Tenali : గుంటూరు జిల్లా తెనాలి మారిస్‌పేటలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు.. వాలంటీరు సందీప్ పై రోహిత్ అనే వ్యక్తి దాడి చేసాడు. సందీప్ వద్ద రోహిత్ 2 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. దీంతో.. ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే.. రోహిత్‌ తన తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి సందీప్‌పై దాడిచేశారు.

గుండెపై బలంగా కొట్టడంతో సందీప్ అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అయితే.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రోహిత్‌, అతని తండ్రి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు.

క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/