ప్రజావాక్కు: సమస్యలపై ప్రజా గళం

Letters to the Editor

పెరిగిన వైద్యం ఖర్చు:- సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశంలో కార్పొరేట్‌ వైద్యం హవా కారణంగా వైద్యసేవల ఖర్చు విపరీతంగా పెరిగిపోయి మధ్యతరగతి ప్రజల పాలిట నరకప్రా యమవ్ఞతోంది. ఇక ప్రత్యేక వైద్య నిపుణుల సంప్రదింపుల సేవలు స్పెషాలిటీ సర్వీసుల పేరిట ఎక్కువ మొత్తంలో డబ్బు లు గుంజుతున్నారు.కాలేయం,హృద్రోగం,కిడ్నీవ్యాధులు, న్యూ రాలజీ,నానోపెడియాట్రిక్‌ సేవలు సామాన్యులకు అందని ద్రాక్ష గా పరిణమిస్తున్నాయి. సాధారణ అనారోగ్యాలకు కూడా పెద్ద పేర్లు పెట్టి, రోగులను భయపెట్టి అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. వైద్యం మొదలుపెట్టాక చికిత్సపనిచేస్తుందో లేదో నిర్ధారించేందుకు ఒకవారంతర్వాత ఫాలోఅప్‌ పేరిట రమ్మన డంరివాజు.అయితే వీటికి కూడా అధికరుసుమువసూలు చేయ డం అసంబద్ధం. కన్సల్టెన్సీతో పాటు వివిధ పరీక్షల పేరిట వేలల్లో చెల్లించుకునే పరిస్థితులు నెలకొనడం బాధాకరం.

ఒక్కసారి ఆలోచించండి: -బట్టా రామకృష్ణ దేవాంగ, నెల్లూరుజిల్లా

భారతదేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఇంతటి భారీ స్థాయిలో ప్రభుత్వ కొలువ్ఞలు భర్తీ చేసిన దాఖలాలు లేవ్ఞ. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది జగన్‌ ప్రభుత్వం మాత్రమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకవేళ ఉన్నతోద్యోగానికి వెళ్లాల నుకుంటే అప్పటివరకు ప్రభుత్వం నుండి తీసుకున్న జీతాన్ని వెనక్కి ఇచ్చేయాలన్న నిబంధన పెట్టడం వల్ల వారు నిరాశ, నిస్పృహలకు లోనవ్ఞతున్నారు.ఏరంగంలోనైనా కిందిస్థాయిలో ఉద్యోగం చేసేవారు ఉన్నత స్థాయి ఉద్యోగం కోసం అహర్ని శలు శ్రమిస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో ఒకవేళ పైస్థాయి ఉద్యోగం వస్తే తాను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త కొలువ్ఞలో స్థిరపడాలనుకుంటారు. కానీ రాష్ట్రప్రభుత్వ నిబంధ నలు సచివాలయ ఉద్యోగులకు గుదిబండగా మారాయి.

మురుగు కేంద్రాలతో ముప్పు: -కె.రామకృష్ణ, నల్గొండ

నల్గొండ జిల్లాలో కాలువలన్నీ మురుగు కేంద్రాలుగా మారిపో యాయి. వీటిపై సిమెంట్‌ మూతలు లేకపోవడం, సంవత్స రాల తరబడి రిపేర్లు చేయకపోవడం, ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోవడంతో సమీపంలోకి వెళ్లాలంటేనే భయం వేస్తోంది. కాలువల పైభాగాన్ని పాదచారులు వినియోగిస్తుండగా ముఖ్యంగా రాత్రిళ్లు వాటిపై ఉన్న పలకలు శిథిలం కావడంతో ప్రమాదాలకు గురవుతున్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యత పెంచాలి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

దేశంలో ఇంజినీరింగ్‌ చదువ్ఞల వేలం వెర్రి కారణంగా వేలాది ఇంజినీరింగ్‌ కాలేజీలు వెలిసి ఏటా పదిలక్షలమంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులను బయటకు పంపుతున్నాయి.అయితే వీరిలో ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యోగర్హాత కలిగిన వారు కేవలం ఒక శాతం మాత్రమేనని నిరుడు ఫిక్కీ, అసోచామ్‌ సంస్థలు స్పష్టం చేశాయి. మిగతా 75 శాతం చిన్నా, చితక ఉద్యోగాలు చేసుకొని బతుకబండి ఈడుస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలి జెన్స్‌,రొబోటిక్స్‌,మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో లక్షలాది ఉద్యోగాలకు అవకాశం వస్తున్నా వాటిని అందిపుచ్చుకునే వారే లేకపోవడం విడ్డూరం. అనేక విద్యా సంస్థలు నాణ్యమైన యాంత్రిక విద్య అందించలేక చతికిలపడి పోతున్నాయి. కాబట్టి ఉద్యోగార్థులందరికీ తగిన ఉపాధి దొరకా లంటే ఉద్యోగాలకు పనికివచ్చే చదువ్ఞలను ప్రవేశపెట్టడంతో పాటు విద్యావ్యవస్థలో నాణ్యత పెంచాలి.

వీధి దీపాలు లేక ఇబ్బందులు: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

నల్గొండ పట్టణంలో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా వ్ఞండే ప్రధాన రహదారులలో వీధి దీపాలు వెలగక వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవ్ఞతున్నారు. కాలం చెల్లిన ట్రాన్స్‌ఫార్మర్లను మార్చకుండా, వాటినే రిపేర్లు చేయించి వాడుతుండడం వలన అవి తరచుగా మొరాయిస్తున్నాయి. ఫలితంగా పట్టణంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. కొన్ని ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. విద్యుత్‌ వైర్లు కూగా ఒక శాస్త్రీయ విధానంలో వేయకపోవడం వలన కాస్తంత గాలివీచినా వైర్లు తెగిపడి ప్రజలు విద్యత్‌ ఘాతాలకు గురవడంతోపాటు విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది.

పుస్తక పఠనం అవసరం:-వి.శశిథర్‌, విశాఖపట్నం

ఈ రోజుల్లో చాలా మంది పుస్తక పఠనం చేయడం లేదు. పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది. తెలియని కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతి పాఠశాలకు గ్రంథాలయం ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక గంటసేపు అయినా పుస్తక పఠనం చేయాలి. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మేధస్సుకు పుస్తక పఠనం అంతే అవసరం. పుస్తక పఠనం అంటే కేవలం కొత్త పుస్తకాలను చదవడం కాదు. పాతకాలం నాటి పుస్తకాలను చదవాలి. విజ్ఞానాన్ని పెంచుకోవాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/