ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

వైద్యవిధానాన్ని మెరుగుపరచాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రతిచిన్న వ్యాధికి విచ్చలవిడిగా ఔషధాలను వాడే భారతీయ వైద్యవిధానంపై అంతర్జాతీయ వైద్యవిధాన మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఒకప్పుడు తీవ్రమైన సందర్భం లోనే మందులు వాడేవారు. కాగా ప్రస్తుతం జలుబు, ఒళ్లు నొప్పులు లాంటి చిన్నపాటి రుగ్మతలకు కూడా యాంటి బయోటిక్స్‌ వాడడం మంచిది కాదని, ఇందువలన శరీరం సత్వసిద్ధంగా రోగాలతో పోరాడే శక్తికోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చివరకు ప్రాణాంతక షెడ్యూల్డ్‌ హెచ్‌ మందు లను కూడా డాక్టర్ల సలహా తీసుకోకుండా మందుల షాపుల నుండి నేరుగా కొనుక్కునే సంస్కృతి పెరిగిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన మందులు కూడా ప్రస్తుతం షాపులలో దొరుకుతున్నాయి.గ్రామాలలో అర్హతలేని ఆర్‌.ఎం.పిలు క్లీనిక్‌లుతెరిచి ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నారు.

మందు ల షాపులు, కంపెనీలు, నకిలీ డాక్టర్లపై మరింత నియంత్రణ ఎంతో అవసరం.

కౌలు రైతులకు కార్డులు:-యస్‌.రఘుపతినాయుడు, తూ.గోజిల్లా

తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు పెరిగాయని,ఇప్పటికైనా కౌలురైతులను ఆదుకోకుంటే రాబోయే రోజుల్లో పంట పడించేవారు ఉండరని ఒక మంత్రి పేర్కొ న్నారు.

అయితే కౌలు రైతులకు అవసరమైన కౌలు కార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిబంధనలు విధి స్తుంది.కౌలుకార్డులపై భూ యజమాని సంతకం ఉండాలం టుంది.

ప్రభుత్వంవద్ద అన్నివివరాలు ఉన్నప్పుడు ప్రభుత్వమే కౌలు కార్డులను జారీ చేయవచ్చుకదా. కౌలు రైతులను ఆదు కోవాలనే మాటల్లో చెప్పడం కాదు. చేతల్లో చేసి చూపించాలి.

సమస్యల వలయంలో ప్రభుత్వ పాఠశాలలు:-కెె.రామకృష్ణ, నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ఉన్నతీకరణ కోసం నాడు-నేడు అన్న కార్యక్రమంచేపట్టడం ముదావహం.

రాష్ట్రం లో 90శాతం పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతున్నాయి. బడులకు ప్రహరీగోడలు లేవ్ఞ. మరుగు దొడ్లు, తాగునీటి సౌకర్యాలు, విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు ఉండవ్ఞ. ఫ్యాన్లు, లైట్లు ఉన్నా పనిచేయవ్ఞ.

రాత్రిళ్లు పాఠశాలలు పలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవ్ఞతు న్నాయి. లక్షలాది రూపాయలు ఖరీదు చేసే పాఠశాలల ఆస్తులు తరచుగా చోరీకి, ధ్వంసానికి గురవుతున్నాయి.

తగ్గుతున్న పాల ఉత్పత్తి: -యర్రమోతు ధర్మరాజు,ధవళేశ్వరం

పశుసంపద కొరవడడం, జనాభా పెరగడం, పెరిగిన జనాభా కు పాలఉత్పత్తి లేక దశాబ్దాల కాలంగా పిండి, డబ్బా, ప్యాకెట్‌, కల్తీ పాలతో చంటిపిల్లల నుండి వృద్ధుల వరకు విని యోగించడం జరుగుతుంది.

అంతంతమాత్రంగా ఉన్న పాల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసు కోవడం లేదు. ఫలితంగా నానాటికీ స్వచ్ఛమైన పాలు ప్రజలకు అందకుండా కల్తీ పాలు సేవించడం మూలంగా లక్షలాది మంది రోగాల బారినపడుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, మంత్రుల, ప్రజాప్రతినిధుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేయడంతో మానవాళికి పాలు మరింత దూరం అవ్ఞతున్నాయి.

అభిమానం చాటుకునేందుకు ఆ సొమ్ముతో రోగులకు పండ్లు, పేదలకు అన్నదానం అందిస్తే వారి ఆకలి తీర్చడంతోపాటు సంబంధిత నేతలు సంతృప్తిపొందుతారు.

పాలు వినియోగించనట్లయితే కొంతమందికైనా పాల ఉత్పత్తులు అందించినట్లవ్ఞతుంది. పాలను నేలపాలు చేసి దుబారా చేయవద్దు.

చట్టాలను కఠినతరం చేయాలి:-ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

రెండు తెలుగురాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఆపరేషన్‌ స్మైల్‌, ఆప రేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాల ద్వారా సుమారు పదివేల మంది చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చినట్లు గుర్తించడంతో బాల కార్మికుల సమస్యఇంకా తీవ్రరూపంలోఉందని అర్థమవ్ఞతోంది.

పేదరికాన్ని ఆసరాగా చేసుకొని బీహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, యుపి, ఒడిశావంటి రాష్ట్రాల నుండి చిన్నారులను గుత్తేదారులు అక్రమంగా తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాల్లో బాలకార్మికులుగా, యాచకులుగా, దొంగలుగా మారుస్తున వైనం అమానుషం.

కుటుంబ సభ్యుల వివరాలు తెలియని కారణంగా ఇప్పటికీ ఇరవైవేల మందిరక్షిత గృహలలో ఉన్నట్లు గణాంకాలు తెలియ చేస్తున్నాయి. ప్రభుత్వాలు తక్షణం స్పందించి బాలకార్మిక చట్టాలను కఠిన తరం చేయాలి.

బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలన జరిగేనా?: -కె. కనకరాజు, విశాఖజిల్లా

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో కొందరు వివిధ మతాలని కించపరుస్తూ పోస్టింగులు పెడుతున్నారు. ఒకరి మతగ్రంథాలలో తప్పులు చూపెడుతూ తీవ్రస్థాయిలో విమ ర్శలు గుప్పిస్తున్నారు.

మతం అనేది వ్యక్తిగత స్వాతంత్య్రం. ఎవరి మతం వారు అనుసరించాల్సిందే. ఇంటింటికి వెళ్లడం మతప్రచారం చేయడం మానుకోవాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/