ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

voice of the people
voice of the people

విదేశీ విద్య కలేనా?:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

రాష్ట్రంలో పేద విద్యార్థులకు విదేశీ విద్య ఒక కలగానే మిగిలి పోయింది. విదేశీ విద్యాదీవెన పథకం ఆరంభం నుండి బాలా రిష్టాలను ఎదుర్కొంటోంది. ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయింపు లుజరిపిన తర్వాత ఒక్కపైసా కూడా విడుదల చేయకపోవడం వలన వేలాది పేదవిద్యార్థుల విదేశీవిద్య ఒక మిథ్య అయింది. గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యాచరన పథకం కింద దరఖాస్తుల ప్రక్రియను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహించి ఎలాంటి ప్రాసెసింగ్‌ ఛార్జీలు లేకుండా పది లక్షలరూపాయల స్కాలర్‌షిప్‌ను నేరుగా విద్యార్థుల ఖాతాలో జమచేశారు. అయితే ఈ సంవత్సరం ఇబిసి విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 800 మందిని ఎంపిక చేసాకా వారికి ఇంతవరకు ఒక్క నయాపైసా కూడా చెల్లించకపోవడం వలన ఈ పథకం భరోసాపై విదేశీ విద్యకు వెళ్లినవారు స్కాలర్‌షిప్‌ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

వెనుకబడ్డ భారత్‌:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధికార్యక్రమంవిడుదల చేసిన మానవాభివృద్ధి సూచి ప్రకారం భారత్‌ రెండు ర్యాంకులు దిగ జారి 131వ స్థానానికి చేరుకోవడం ఆందోళనకర పరిణామం. లోగడ మనకంటె వెనుకబడి ఉన్న భూటాన్‌, శ్రీలంక, థా§్‌ు లాండ్‌, నేపాల్‌ దేశాలు ఇసారి మనకంటె మెరుగైన స్థానాలకు చేరుకోవడం మనదేశానికి కనువిప్పుకావాలి. జిడిపి ఘనంగా ఉందని ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్న మన పాలకులు విద్య,వైద్యం,ఆయుర్దాయం, పేదరికం, మాతాశిశుమరణాలు, ఆకలిచవ్ఞలు వంటి ముఖ్యమైన అంశాలలో వెనుకబడి ఉండ టం పట్ల దృష్టిసారించాలి. సాధారణ ప్రజానీకం ఆదాయం పెంచాలి. మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి.కెజి నుండి పిజి వరకు నిర్బంధ విద్య అమలు తప్పనిసరి కావాలి.

ఆదేశించాలి:-మా.శ్రీ.రాజు, పాల్వంచ

ఉద్యోగులపై లంచం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదుచేశాక, న్యాయవిచారణ ప్రారంభించడానికి సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి అవసరం. న్యాయవిచారణకు సం బంధిత ప్రభుత్వ శాఖలు ఏళ్లతరబడి అనుమతులు ఇవ్వడం లేదు.దీంతో అవినీతిపరులకు భయం లేకుండాపోయి, మళ్లీ మళ్లీ యధేచ్ఛగా అవినీతి పనులు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులపై ఉన్న అవినీతి కేసులను సమీక్షించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించాలి.

చర్చలు ముఖ్యం:-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా

దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై తీర్పు నిస్తూ సుప్రీంకోర్టు పార్లమెంట్‌లో పారదర్శకంగా, ఆరోగ్యకర మైన చర్చలు జరగాలని సూచనలు జారీ చేసింది. దురదృష్ట వశాత్తు ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రాణప్రదమైన పారదర్శ కత మనచట్టసభలలో లోపించింది.పార్లమెంట్‌నుండి అసెంబ్లీల వరకు గొడవలు,గందరగోళం తప్ప ఏ అంశంపైనా కూలంకుష మైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగడం లేదు. పర్యవసానంగా ఎంతో కీలకమైన ఆర్థిక బిల్లులు కూడా మూజువాణి ఓటుతో ఆమోదంపొందుతున్నాయి.వేలకోట్లరూపాయలు వ్యయమయ్యే ప్రాజెక్టులు నామమాత్రపు చర్చతో చట్టసభల్ని దాటుకొస్తున్నా యి.ఈధోరణి ఎంతమాత్రం సమర్థనీయంకాదు. ప్రజాసంక్షే మంకోసం చేసేచట్టాలపై ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులకు విస్తారంగా చర్చించే అవకాశం ఇవ్వడం తప్పనిసరి.

రోడ్లపక్కన కూరగాలయ విక్రయాలు: -కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్‌, భూపాలపల్లిజిల్లా

రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో వివిధప్రాంతాలకు వెళ్లేరోడ్ల పక్క న కూరగాయలు, పండ్లు,మొక్కజొన్న కంకులు, టోపీ, మాస్క్‌ లు విక్రయిస్తున్నారు. ఒక్కోసారి వాహనాలు అదుపుతప్పి వారి మీదికి దూసుకుపోవడం జరుగుతూఉంది.అనేకమంది మృత్యు వాతపడిన సంఘటనలు గలవ్ఞ.ఎక్కువగా హన్మకొండ, భూపా లపల్లి ప్రధాన రహదారి మీద గుడెప్పడ్‌ దగ్గర రోట్ల వెంబడి అనేక కూరగాయలు, పండ్లు విక్రయాలు చేసే షాప్‌లు తాత్కా లికంగా వెలిశాయి. మద్యం మత్తులో లారీ డ్రైవర్లు రాత్రివేళ వేగంగా రావడం, పగలు కూడా నిత్యం వాహనాల రాకపోకలు జరిగి ప్రమాదాలకు గురవ్ఞతున్నారు. సంబంధిత అధికారులు దృష్టిసారించి ప్రధాన రహదారుల వెంబడి వివిధ వస్తువ్ఞలు, పదార్థాలు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలి.

అధిక నిధులు కేటాయించాలి: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలకు నిధులుఅధికంగా కేటా యించాలి. నూతన మున్సిపాలిటీలలో మౌలిక వసతుల రూప కల్పన జరగాలి. ప్రతి కాలనీకు సిసిరోడ్ల నిర్మాణం జరగాలి. నీటికొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. పలు కాల నీలలో నూతన విద్యుత్‌ స్తంభాలను కూడా ఏర్పాటు చేయాలి. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు రాత్రిపూట బస చేయడానికి గెస్ట్‌హౌస్‌ ఏర్పాటుకు నిధులు కేటాయించాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/