ప్రజావాక్కు: సమస్యలపై గళం

People
voice of the people

సన్నబియ్యం అందించాలి: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి

రాష్ట్రంలో ‘జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్నభోజన పథకాన్ని ఇటీవలనే మెనూమార్చి పిల్లలకు రుచికరమైన ఆహా రాన్ని అందించే ప్రయత్నంచేస్తున్నారు. ఈ క్రమంలో రోజుకు ఒక రకమైన ఆహార పదార్థాల్ని మోనూలో పొందుపరిచారు. పిల్లలకు భోజనంపట్ల ఆసక్తి కలిగేలా, పౌష్టికాహారాన్ని అందిం చేలా మెనూని తీర్చిదిద్దిన విధానం అభింనదనీయం. అయితే ఇలాంటి మెనూమరింత రుచికరంగా పిల్లలు భుజించాలి అంటే ప్రస్తుతంఇస్తున్న రేషన్‌ బియ్యానికి బదులు పాతసన్నబియ్యం గాని, లేదా స్థానికంగా ఉండే బియ్యం గాని సేకరించి వండిన ప్పుడు మాత్రమే అవి బాగుంటాయి. అన్నం బాగోన్నప్పుడు అవి రుచికరంగా ఉండవు. మెనూలో ఉన్నవి ఇంచుమించు అన్నిఆహారపదార్థాలు అన్నం ఆధారిత వంటలు కాబట్టి అన్నం బాగుండాలి అంటే బియ్యాన్ని కచ్చితంగా మార్చినప్పుడే వంట లు మరింత రుచిగా ఉంటాయి. పిల్లల విద్యాఅవసరాలతో పాటు ఆహార విషయాలు గురించి కూడా పట్టించుకుంటున్న ప్రభుత్వం ఈ చిన్న విషయాన్ని కూడా సవరించి సంస్కరించి నప్పుడే పిల్లలు, తల్లిదండ్రులు ఆనందపడతారు.

విస్తరిస్తున్న భూతవైద్యం:-బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌

దేశాన్ని దుష్టశక్తులు పీడిస్తున్నాయి. అరాచకత్వం పెరిగిపోతోంది. రౌడీయిజం,హత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో విద్య,వైద్య సేవలు అటకెక్కిపోతూ వికృతమైన, వినాశకరమైన మార్పులు సంతరించుకుంటున్నా యి. ప్రభుత్వ వైద్యశాలల ప్రాంగణాలలో తావీజులు, జ్యోతి షాలకోసం ప్రత్యేక విభాగాలు తిష్టవేసుకున్నాయి. విస్తరించి నేడువిశ్వవిద్యాలయాల్లో ఉనికిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. భూతవైద్యాన్ని ఒక సర్టిఫికేట్‌ కోర్సుగా ప్రత్యేక విద్యను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రజలు విజ్ఞులు జరుగుతున్న ఈ విష పరిణామాలపై తమ నిరసనలు తెలుపుతూ వాటిని నిరోధించలేమని నాడు దేశం అధోగతి పాలుకాక తప్పదు.

కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మించాలి: -అజ్జు సురేష్‌ ఆలువాల, హైదరాబాద్‌

31 జిల్లాల రాజధాని, ప్రాచీననగరం, భిన్నసంస్కృ తికి నిలయం అయిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌నగరం గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం. మెట్రో, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు నిధులు ఏమైనాయో తెలియదు. హైదరాబాద్‌ నగరంలో అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయాలి.

ప్రజాదరణ పొందని సినిమాలు:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌,నల్గొండ

2019 సంవత్సరంలో తెలుగులో 200పై చిలుకు సినిమాలు విడుదలైనా పట్టుమని 10 శాతం సినిమాలు కూడా ప్రజాదరణ పొంది బాక్సాఫీసువద్దవిజయం సాధించలేకపోయాయంటే సిని మాల నాణ్యత ఎంతఅధ్వాన్నంగా ఉందో ఇట్టే అర్థమవ్ఞతుంది. సరైన కథ, కథనాలు లేకపోవడం, నిర్మాత దర్శకులలో మంచి సినిమాలు నిర్మించాలన్నదృఢసంకల్పం లోపించడం, సినిమాల కంటే మంచి వినోదం మీడియా ద్వారా లభిస్తుండడం ముఖ్య కారణాలు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళలో విజయం శాతం ఎక్కువగా ఉండడం పట్ల మన తెలుగు సినీ రంగం ఆత్మశోధన చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో సినిమాల నాణ్యత అధమంగా ఉండడంతోపాటు టిక్కెట్ల రేట్లు బాగా పెరగడం వలన కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. గత సంవత్సరంలో ఎదురైన చేదు ఫలితాలను దృష్టిలో ఉంచు కొని కనీసం 2020వ సంవత్సరంలోనైనా నాణ్యమైన సినిమా ల ద్వారా విజయశాతం పెరుగుతుందని ఆశిద్దాం.

ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్‌ ప్రాక్టీసు: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేస్తున్న వైద్యులు, ప్రైవేట్‌ ప్రాక్టీసు కూడా చేస్తుండడం వలన వారి విధులపై తగిన శ్రద్ధచూపడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవ్ఞతోంది. ప్రభుత్వ పరిశోధనాస్పత్రులు జిల్లా, ప్రాంతీ య ఆస్పత్రులలో పనిచేస్తున్న వైద్యులు సేవలు అందించాల్సిన సమయంలో ప్రైవేట్‌ ప్రాక్టీసులో మునిగి తేలుతున్నారు. సమ యపాలనపాటించకపోవడం,విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం, అధికంగా సెలవ్ఞలు వంటి కారణాల వలన ప్రభుత్వ ఆస్పత్రు లలో నాణ్యమైన సేవలు లభించడం లేదు. ప్రభుత్వ డాక్టర్లకు ప్రైవేట్‌ ప్రాక్టీసును రద్దు చేయాలి.

అరకొర వేతనాలేనా?:-ఈదునూరు వెంకటేశ్వర్లు,వరంగల్‌

రాష్ట్రవ్యాప్తంగా మహాత్మాజ్యోతిబాఫూలే సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడితోభారమై రెగ్యులర్‌గా ప్రభుత్వ ఉద్యోగమొచ్చినా ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు మనం చూశాం. రోజం తా పాఠశాలలో గడుపుతున్నా చాలీచాలని వేతనాలు ఇస్తూ సొసైటీ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఉపాధ్యాయు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమకు రెగ్యులర్‌ వాళ్లతో సమా నమైన విద్యార్హతులున్నా వేతనాల్లో మాత్రం ఇంత వ్యత్యాసం ఎందుకుచూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/