గృహనిర్మాణంపై కరోనా వైరస్ ప్రభావం

కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ

coronavirus effect
coronavirus effect

కరోనాతో కుదేలైన ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవానికి కేంద్రప్రభుత్వం బాటలు పరుస్తోంది. కీలకరంగమైన రియల్‌ ఎస్టేట్‌ కష్టాలపైనా దృష్టి నిలిపింది.

ప్రాజెక్టుల పూర్తికి, కాంట్రాక్టర్లకు చేయూతనిచ్చే పలు పథకాలు, ప్యాకేజీలకు ముందుకొచ్చింది. క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నా అధికమించాలన్నదే ఇప్పటి ప్రభుత్వకర్తవ్యమని వల్లెవేసింది.

ప్రస్తుత రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో స్వావలంభన భారత్‌ కల సాకారమౌతుందని సంకల్పిస్తోంది. దీర్ఘకాలంలో ఎదురయ్యే సవాళ్లను అధికమించేందుకు ఈ ప్యాకేజీ ఉత్ప్రేకరమౌతుందని నిర్దేశిస్తోంది.

దే శవ్యాప్తంగా కాల్చుకుతింటున్న కరోనా అన్నిరంగాలను చుట్టుముట్టేసింది. ప్రధానంగా ఉత్పత్తి రంగంపై ఎక్కువశాతం ప్రభావాన్ని చూపెట్టింది.

దీంతోపాటు రియల్‌ఎస్టేట్‌పైనా కోరలు చాచింది. కరోనా వైరస్‌ విస్తృతి నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నివాసగృహాలరియల్‌ ఎస్టేట్‌రంగాన్ని అతలాకుతలం చేస్తోంది.

దేశంలోని ప్రధాననగరాల్లో ఇళ్ల నిర్మాణాలు మంగించాయి. ఇళ్లఅమ్మకాలు, అపార్టుమెంట్లు, వాణిజ్యసముదాయాల అమ్మకాలు దాదాపు 35శాతం పడిపోవచ్చని ప్రాపర్టీ లావాదేవీల అధ్యయన సంస్థ ఆన్‌రాక్‌ ఇటీవలే అంచనాలను వెల్లడించింది.

వాణిజ్య, కార్యాలయాల స్పేస్‌ కూడా 30శాతం క్షీణించే అవకాశం లేకపోలేదని ఆ సంస్థ నిర్ధారణకొచ్చింది.

వచ్చే కొంతకాలం ఈ గడ్డుస్థితి తప్పకపోవచ్చని, ఇది రికవరీకి ఎంతకాలం పడుతుందో చెప్పలేమని ఆన్‌రాక్‌ ఉటంకించింది. ఈ ఏడాదిలో కొత్తగా అందుబాటులో వచ్చే ఇళ్ల సంఖ్య 25-30 శాతం తగ్గవచ్చని ఆరంగ నిపుణులు పేర్కొంటున్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, లాక్‌డౌన్‌ కారణంగా అలసు ప్రాజెకు ్టసైట్లు వద్ద సందడీ కానరావడం లేదు. సందర్శకులు లేరు,

లావాదేవీల్లేవ్ఞ. సంప్రదింపులు అసలే లేవు. కారణం కొనసాగుతున్న ప్రాజెక్టులు, వెంచర్లకు ‘తాళం పడటం, వైరస్‌ మహమ్మరి పుణ్యమా అని బిల్డర్లు నివ్వెరపోయి దిక్కులు చూడటం లాంటి దృశ్యాలు తెరమీదకొచ్చాయి.

కొన్నికొన్ని చోట్ల నిర్మాణాలు ఆగిపోయి ప్రాజెక్టులు కళావిహీనంగా మారాయి. పచ్చిపచ్చిమొక్కలు మెలిచి వెక్కిరిస్తున్నాయి.

వాస్తవానికి వేసవిలో నిర్మాణరంగం ఇతర సీజన్ల కన్నా దూకుడుగా ఉంటుందన్నది తెలిసిందే. అలాగే నిర్మాణసంస్థల ఆఫీసులూ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొవాలో తెలియక సతమతమౌ తున్నాయి. ఇళ్లు కొనాలనుకునే వారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు.

ఆర్థిక సంక్షోభం, బ్యాంకింగ్‌ కార్యకలాపాలస్తంభన, రుణాలు పొందేందుకు అవకాశం లేక లాక్‌డౌన్లో. నగదు లభ్యతపై నియంత్రణలు పరోక్షంగా ప్రభావం చూపడం, ఉద్యోగాల్లో ఒడుదుడుగులు, జీతభత్యాల్లో తేడాలు..ఇలా ఎన్నో అంశాలు కొనుగోలు శక్తి తగ్గించేందుకు హేతువ్ఞలయ్యాయి.

ఈ కరోనా వచ్చాక భవిష్యత్‌లో ఈఎంఐ (నెలసరి వాయిదాల) లు తీర్చగలమా, మున్ముందు పరిస్థితిపై అంచనాలు వేసుకుంటూ నిర్మాణరంగ ప్రస్తుత పరిస్థితిని తలచుకుంటూ ఇళ్ల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు.

వీటన్నింటికీ తోడు రాబోయే రోజుల్లో ప్రభుత్వపరంగా లభించే ఉద్దీపనలు, ప్యాకేజీలు ఉపయోగపడతాయని ఊహించుకుంటున్నారో, ఏతావాతా రిహాన్‌ ఎస్టేట్‌వైపు ఆకర్షణలు మందగించాయి.

నిర్మాణాలకు అవసరమైన సామాగ్రి, వస్తువుల ధరలు ఎలా ఉంటాయోనన్న సందిగ్ధత వెన్నాడుతోంది. చాలా రోజులుగా మూతపడిన షాపులు ఇంకా తెరచుకోలేదు.

అక్కడక్కడా నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులిచ్చినా, కార్యకలాపాలు అరకొరే. ముఖ్యంగా సిమెంటు, ఇసుక లభ్యత గగనమైపోయింది. సుమారుగా రూ.250గా ఉన్న సిమెంటు బస్తా ధర రూ.320 దాకా ఎగబాకింది. ఇక ఇసుక కూడా దొరకడం కష్టమైంది.

ఈ రెండూ ఈ వేసవిలో నిర్మాణాలు చేద్దామని భావించిన వారికి భారమయ్యాయి. ఈ కరోనాకు ముందు వాస్తవానికి అనుకున్న వ్యయానికి సిమెంటు, ఇసుక ధరలు ఆజ్యం పోశాయి. చిన్నచిన్న నిర్మాణాల వారు ఈ ‘కరోనా సుంఖం హెచ్చు ధరల రూపంలో భరించాల్సి వస్తోంది.

వ్యక్తిగత నిర్మాణాలనో, మరమ్మతులను చేసుకుందామనుకున్నా వారు ఆ పనులను వాయిదా వేసుకున్నారు.

మధ్యలో కొన్నాళ్లపాటు కరోనా నియంత్రణల కారణంగా ఆగిపోయిన నిర్మాణపనులు ఇప్పటికీ వెసులుబాటు కల్పించినా మనుపటిస్థాయిని అందుకోలేకపోతున్నాయి.

పనులకు వచ్చే కూలీలు, వృత్తినిపుణులు అనుకున్నంతమంది రాకపోవడం ఒక కారణంగా మనం చెప్పక తప్పదు. గ్రామాల్లో సైతం చిన్నచిన్న మరమ్మతులు, ప్రహారీగోడలు,రక్షణ పనులు స్తంభించిపోయాయి.

ఇక ఇళ్లలో అంతర్భాగమైన ఇతర నిర్మాణరంగ అనుబంధ పనులూ వలసకార్మికులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆగిపోయాయి.

మనతెలుగు రాష్ట్రాల్లో నిర్మాణరంగ పనులకు పొరుగు రాష్ట్రాల నుంచి,ఉత్తరాది నుంచి పెద్దసంఖ్యలో వలసదారులు వస్తుంటారు. వారివారి నైపుణ్యపనుల్లో ఇక్కడ ఇళ్లనిర్మాణంలో పాలుపంచుకుంటారు.

కరోనా నేపధ్యంలో వారి బతుకు భారమై సొంతూళ్లకు ప్రయాణం కడుతున్నారు. మళ్లీ వారి తిరిగి రాక అసంగిద్ధమే. పూర్వ పరిస్థితులు నలకొనాంటే ఇప్పుడయ్యేపని కాదనిరియాన్‌ నిపుణులు నిట్టూరుస్తున్నారు. ధరలు పెరుగుదలతోపాటు ఎక్కడిక్కడ అమ్మకాలు నిలిచిపోవడంతో నిర్మాణారులు కుదేలయ్యారు.

ఈ పాటికేచేతిలో ఉన్న ప్రాజెక్టులు నిలిచిపోవడం, అప్పులు, వడ్డీలు పెరిగి తడవకుండానే మోపెడవడం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కరోనాతో అసలు నిర్మాణరంగాన్నే బిల్డర్లు వదిలేసే పరిస్థితి వచ్చిందని వారి అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 20రకాల వృత్తినిపుణులు ఎప్పుడు కార్యరూపంలోకొస్తారో, ఎంత అదనంగా భµరించాల్సి వస్తుందోనన్న భయాలు రియల్టర్లను వెంటాడుతున్నాయి.

ఇవన్నీ కరోనా కన్‌స్ట్రక్షన్‌ కష్టాలేనని వీళ్లంతా కన్నీళ్లపర్యంతమౌతున్నారు. ప్రభుత్వకోణంలో చూస్తే భారీ ఉద్దీపన, ప్యాకేజీల ప్రకటనకు కేంద్రప్రభుత్వం సన్నద్ధమైంది.

కొండంత అండగా నిలుస్తామని భరోసానిస్తోంది. గృహనిర్మాణరంగం,మధ్య ఆదాయవర్గాలకు దన్నుగా నిలవడమే ధ్యేయమని చెబుతోంది. కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్‌ ఎస్టేట్‌రంగనికి ప్రభుత్వం ఊరట కల్పించింది.

ప్రాజెక్టుల పర్తికి నిర్దేశించిన గడుపును 6నెలలు పొడిగించడం హర్షణీయమే. దీంతో రియల్‌ఎస్టేట్‌ డెవలపర్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం తలపోస్తోంది.

వలస కూలీలు, వృత్తినైపుణ్యాలు, వ్యాపారాలు, బిల్డర్లు ఇలా అందరూ నిర్మాణరంగాన్ని వివిధ దృక్కోణాల్లో ప్యాకేజీనిచ్చి ఆదుకోవాలని, పునరుజ్జీవం కల్పించాలని ముక్తకంఠంతో మొరపెట్టుకుంటున్నారు. కాలాతీతమైనా అందరి ఆవేదన తీరుతుందని ఆశిద్దాం.

  • చెన్నుపాటి రామారావు

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/