మా ఎలక్షన్స్ : నాగబాబు ఫై ఫైనల్ పంచ్ వేసిన మంచు విష్ణు

‘మా’ ఎన్నికల సమరం చివరి దశకు వచ్చింది. మరికొన్ని గంటల్లో మా ఉత్కంఠ కు తెరపడబోతుంది. మంచు విష్ణు కు ఓట్ వేస్తారా..ప్రకాష్ రాజు కు ఓట్ వేస్తారా అనేది తేలబోతుంది. ఈ క్రమంలో ఫైనల్ పంచ్ మంచు విష్ణు..మెగా బ్రదర్ నాగబాబుఫై వేశారు. తెలుగు భాషపై ప్రకాష్ రాజ్ కు, విష్ణుకు పరీక్ష పెడితే.. ప్రకాష్ కు 90శాతం మార్కులొస్తాయని, మంచు విష్ణు కనీసం పాస్ అవ్వరని నాగబాబు విమర్శించారు. ఈ విమర్శ ఫై విష్ణు స్పందించారు.

తెలుగు భాష కంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి క్యారెక్టర్ చాలా ముఖ్యమని.. కాబట్టి ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో పరీక్ష పెడితే బాగుంటుందని నాగబాబుకు సూచించారు. “వ్యక్తిగతంగా క్యారెక్టర్ లో మార్కులు వేయాలనుకుంటే నాకు నూటికి ఎన్ని మార్కులొస్తాయో ఇండస్ట్రీలో అడగండి. ఆయనకు (ప్రకాష్ రాజ్) ఎన్ని మార్కులొస్తాయో.. ఆయనతో నటించిన తోటి నటీనటుల్ని, దర్శకుల్ని అడగండి. మన భాషలోనే కాదు, ఆయన నటించిన అన్ని భాషల్లో ఆయన క్యారెక్టర్ గురించి అడగండి. క్యారెక్టర్ లేని నాలెడ్జ్ పనికిరాదు.” నరేంద్రమోడీని విమర్శించేంత మేధానిగా ప్రకాష్ రాజ్ ను నాగబాబు అభివర్ణించారని, ట్విట్టర్ ఓపెన్ చేస్తే, ప్రకాష్ రాజ్ లానే వేలమంది పిచ్చుకలు ట్విట్టర్ లో విమర్శలు చేస్తుంటారని ఎద్దేవా చేశాడు విష్ణు.