సింగరేణి చిన్నారి కుటుంబానికి రూ.2.5 లక్షల చెక్‌ను అందజేసిన పవన్ కళ్యాణ్

సింగరేణి చిన్నారి కుటుంబానికి రూ.2.5 లక్షల చెక్‌ను అందజేసిన పవన్ కళ్యాణ్

సైదాబాద్‌ సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల చిన్నారి ఫై రాజు అనే యువకుడు అత్యాచారం చేసి , చంపేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అత్యాచారం చేసి, చంపేసి అక్కడి నుండి వెళ్లిన రాజు కోసం వారం పాటు పోలీసులు విపరీతంగా గాలించారు. అతన్ని పట్టించిన వారికి రూ.10 లక్షలు నజరానా కూడా ప్రకటించారు. కానీ, మత్తుకు అత్యంత అలవాటు పడిన సదరు వ్యక్తి స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైల్వేట్రాక్‌పై ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కేసు ముగిసినట్లు అయ్యింది.

సినీ నటుడు , జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కేసు జరుగుతున్న సమయంలోనే బాధితురాలు చైత్ర కుటుంబ సభ్యులను కలిసేందుకు సింగరేణి కాలనీ కి వెళ్లారు. అయితే అప్పుడు అభిమానుల రద్ది ఎక్కువగా ఉండటంతో.. ఆయన కారు వద్దనే బాధితురాలి తండ్రిని కలుసుకొని భరోసా ఇచ్చి వెళ్లారు. తాజాగా ఓ మీటింగ్ కోసం వచ్చిన పవన్ ఆ మీటింగ్ తర్వాత చైత్ర కుటుంబాన్ని మరోసారి కలిశారు. ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలి అని ఆయన రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జరిగిన ఘటన చాలా దారుణం అని తెలిపారు. చనిపోయిన చిన్నారిని తీసుకరాలేమని..ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెపుతూ.. రూ.2.5 లక్షల చెక్‌ను అందించారు. పవన్ రావడం..తమకు ధైర్యం చెప్పడం తో పాటు చెక్ ను కూడా అందజేయడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇక అభిమానులైతే మరోసారి పవన్ గొప్ప మనసు గురించి విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు.