బిగ్ బాస్ 5 : హమీద ఎలిమినేట్‌ .. శ్రీరామ్ తట్టుకోగలడా..?

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ప్రతి శని, ఆదివారాల్లో నాగార్జున హౌస్ కి హాజరై సభ్యులందరినీ పలకరించి వారం మొత్తం మీద జరిగిన తప్పుల విషయంలో నిలదీస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇక అదే విధంగా నాగార్జున ఈ వారం కూడా హౌస్ సభ్యులందరినీ నిలదీశారు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి హమీద ఎలిమినేట్‌ అయ్యిందని తెలుస్తుంది. ఈ వారం యాంకర్‌ రవి, షణ్ముఖ్‌ , మానస్‌, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో హమీదా, విశ్వ, జెస్సీ డేంజర్‌ జోన్‌లో ఉండగా వీళ్లలో నుంచే ఒకరు ఎలిమినేట్‌ అవుతారని అది హమీదనే అని ముందు నుండి అంత అనుకున్నారు. ఆలా అనుకున్నట్లే హమీద ఎలిమినేట్‌ అయ్యినట్లు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.

హమీద మొదటి నుండి కూడా ఎక్కువగా శ్రీరామ్ తోనే చనువు గా ఉండడం..ఇతర సభ్యులతో పెద్దగా కలిసినట్లు ఉండకపోవడం..ఆమెపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. ప్రతి చిన్న విషయానికి శ్రీరామ్‌ మీదే ఆధారపడుతోందన్న విమర్శలు కూడా వచ్చాయి. ముందు నుంచి కూడా హమీదా సరిగా గేమ్ ఆడడం లేదని, ఎక్కువగా శ్రీ రామ్ తో లవ్ లో మునిగి తేలుతోందని మిగతా హౌస్ మేట్స్ సహా బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. శనివారం సాయంత్రం ముగిసిన ఎలిమినేషన్ ప్రక్రియ ప్రకారం అతి తక్కువ ఓట్లు వచ్చిన హమీదా ఎలిమినేట్ అయినట్టు సమాచారం. మరి హమీద ఇంటి నుండి వెళ్తే…శ్రీరామ్ ఎలా తట్టుకుంటారో చూడాలి.